మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి చింత ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం రాత్రి ప్రయాణికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులు మహారాష్ట్రలోని సిర్వాంచ కు చెందిన రామ్ లాల్ ,రాజబాబుగా గుర్తించమని పోలీసులు తెలిపారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు వెళుతుండగా కలవర్టర్ ఢీకొని పక్కనే ఉన్న కాలువలో పడడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.