అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ పత్తికొండ రోడ్డులోని భవాని వైన్స్ షాపు బయట నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసుకొని వెళ్ళాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ బండి మోటు విధికి చెందిన తులసి వైన్స్ షాపులో పని చేస్తాడు. ఈ క్రమంలో వైన్స్ కు వెళ్లి తన బైక్ ను బయట నిలిపి ఉంచాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి చేరుకొని మద్యం కొనుగోలు చేసి తులసికి చెందిన బైక్ తీసుకొని వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా విచారణ చేస్తున్నారు.