గుమ్మడిదలలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ జిరాక్స్ పట్టుకొని గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎరువు కోసం కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కెసిఆర్ హయాంలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు