నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం MLA డా. భూపతి రెడ్డి 200 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిరికొండ 19, ధర్పల్లి 02, జక్రాన్ పల్లి 42, ఇందల్వాయి 26, డిచ్పల్లి 60,మోపాల్ 37,రూరల్ మండలానికి చెందిన 14 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులు మంజూరయ్యాయి. చెక్కులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.