ప్రముఖ రాజకీయ నాయకుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంను కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని ఓ కన్వెన్షన్ హల్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయ సేవలను గురించి కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.