అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కనపల్లి సమీపంలో సోమవారం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి భరత్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సబితమ్మ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కక్కలపల్లి గ్రామ సమీపంలో జిఎంఆర్ గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 10న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని మూడు నాలుగు ప్రాంతాలు పరిశీలించి సరైనది ఎంపిక చేసి ఏర్పాట్లను ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.