నిజామాబాద్‌లో వినాయక నిమజ్జన రథోత్సవ వేడుకలు శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. సార్వజనిక్ కమిటీ సభ్యులు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున శోభయాత్రలో పాల్గొన్నారు. సీపీ సాయి చైతన్య భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.