సదాశివ నగర్ మండలం ఉత్నూర్ పీహెచ్సీలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు 'స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్'లో భాగంగా జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీవాణి ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సాయికుమార్ తెలిపారు. శిబిరంలో జ్వరం, జలుబు, బీపీ, డయాబెటిస్, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. అనంతరం అవసరమైన వారికి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ వచ్చాక ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వంటివి ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి