మాజీ సీఎం వైఎస్ జగన్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని సంభోదించడం హేయమైన చర్య అని ఉంగుటూరు మండల వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు వైసీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మారడా మంగారావు, జడ్పీటీసీ జయలక్ష్మి, ఎంపీపీ శ్రీలక్ష్మి, పార్టీ నాయకులు మాట్లాడుతూ బాలకృష్ణ వ్యాఖ్యల పై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ ను విమర్శించే స్థాయి బాలకృష్ణ కు లేదని, అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణం బాలకృష్ణ తన వ్యాక్యలు వెనక్కు తీసుకోవాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.