ఆగస్టు 31వ తేదీ లోపు రైతులు తమ పంటలకు పసల్ బీమా యోజన కింద అందించే బీమాకు నమోదు చేయించుకోవాలని ప్రకాశం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా అన్నారు. ఏ పంటలకు ఎంత ధర చెల్లించి బీమా చేయించుకోవాలో మహబూబ్ బాషా సోషల్ మీడియా వేదికగా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రైతులకు ప్రకటన విడుదల చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే మీ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించి మీ అనుమానాలను తీర్చుకోవచ్చని వెంటనే రైతులు పంటకు బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.