ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ మాట్లాడుతూ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. ఎటువంటి దళారులను ఆశ్రయించవద్దని అన్ని జబ్బులకు ఉచితంగా వైద్యం చేస్తున్నామన్నారు.