తెలుగు భాష అనంతమైనదని, జీవనది లాంటిదని, భావ వ్యక్తీకరణకు భాషా ముఖ్యమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక, తెలుగు భాషాభివృద్ధి సంఘం అధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం సాయంకాలం 6 గంటలకు తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు. తెలుగు పండితులు గోపాలశర్మ మాట్లాడుతూ తెలుగు భాష మధురమైనదని, తెలుగు భాషకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు.