యోగాను ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాష అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురంలో మూడవరోజు శనివారం రాష్ట్ర స్థాయి యోగ పోటీలు కొనసాగాయి. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి యోగ ఎదిగిందన్నారు. యోగ చేయడం వల్ల శారీరిక రుగ్మతలు ఉండవన్నారు. వివిధ విభాగాల్లో బాల బాలికలకు వేర్వేరుగా యోగా పోటీలు జరిగాయి. యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక పాల్గొన్నారు.