రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసి మాట్లాడారు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేయలేదని రైతులకు బోనస్ డబ్బులు ఖాతాలలో జమ కావట్లేదని అన్నారు 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు మిగతా డబ్బులు బ్యాంకుకు చెల్లించి కొన్ని నెలలు గడిచిన ఇప్పటికే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు