రైతుల గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ పార్టీ కు లేదని ఉమ్మడి గండీడ్ మండలాల అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్ రెడ్డి అన్నారు. గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు.