పల్నాడు జిల్లా,సత్తెనపల్లి లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర హస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బుధవారం ఉదయం సూరి అనే విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పోందుతూ విద్యార్థి మృతి చెందాడు.మృతుడు సూరి KC రెడ్డి ఫార్మసి కాలేజ్ లో మూడో సంవత్సరం బీ ఫార్మసి చదువుతున్నట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు.