లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బాపట్ల సీఐ రాంబాబు హెచ్చరించారు. శనివారం బాపట్లలోని పలు లాడ్జిలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిలకు వచ్చే వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రికార్డులలో నమోదు చేయాలని తెలిపారు. లాడ్జిలలో బస చేసే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జి యాజమాన్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.