కరీంనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్సై ఇషాక్ సోమవారం సాయంత్రం మానవత్వం చాటుకున్నారు. గీత భవన్ కాంప్లెక్స్ ప్రాంతంలో రేణిగుంట గ్రామానికి చెందిన ఒక మహిళ పర్సు పోగొట్టుకున్నారు. ఆ పర్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా సదరు మహిళను గుర్తించారు. అనంతరం, కరీంనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్ మరియు ఎస్సై ఇషాక్ లు ఆ పర్సును సంబంధిత మహిళకు సురక్షితంగా అందజేశారు. పోలీసుల నిజాయితీని, అంకితభావాన్ని స్థానికులు అభినందించారు.