వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని CPM జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, భూక్యా చందు నాయక్ అన్నారు.సెప్టెంబర్ 17న జరిగే బహిరంగ సభకు కరపత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిన పోరాట యోధులను అవమానపర్చే BJP మతోన్మాద శక్తుల కుట్రాలను ఎండగట్టాలని,భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా ఉద్యమాలలో CPM ముందుకు పోతున్నాదని అన్నారు.