ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసిపి పై బురదజల్లే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఎక్స్ వేదికగా ఆదివారం విమర్శలు గుప్పించారు. జగనన్న హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు అన్నారు. ఇచ్చిన హామీలలో అరాకూర నెరవేర్చి మొత్తం హామీలు విచ్చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అదేమిటి అని ప్రశ్నిస్తున్న వైసీపీపై బురద జల్లుతున్నారని అన్నారు.