ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన ఓటు హక్కును వినియోగించారు. ఢిల్లీలోని పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపాటు కోసం ఇలాంటి ఎన్నికలలో ఎంపీలు సక్రమంగా తమ ఓటు హక్కును వినియోగించడం చాలా అవసరమని అన్నారు.జగదీశ్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ ఎన్నికలో మహారాష్ట్ర గవర్నర