రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామంలో ఐదు రోజుల పాటు శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆదివారం చివరి రోజు లడ్డు వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన గిద్దలూరు రవితేజ రూ.3.60 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు. అనంతరం గ్రామంలో లడ్డు ను ఊరేగించారు. తర్వాత జరిగిన గ్రామోత్సవంలో గ్రామస్తులందరూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు.