నంద్యాల జిల్లా బనగానపల్లెలోని వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో శనివారం పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బనగానపల్లె సిఐలు మంజునాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఎస్సై కల్పన, ఉత్సవ కమిటీ ప్రతినిధులు టంగుటూరు సీనయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తప్పక నిబంధనలు పాటించాలని సూచించారు.