కొలిమిగుండ్లలోని పలు కాలనీల్లో తాగునీటి పైపైన్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ జినుగు శివరాముడు బుధవారం వెల్లడించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో పైప్లాన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా మారుతోందని కాలనీల ప్రజల ఫిర్యాదు మేరకు తాగునీటి పైపైన్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ శివ తెలిపారు. ప్రజలు నీటిని వృథా చేయరాదన్నారు.