రాష్ట్ర బిజెపి వీడియో ఇన్చార్జిగా పనిచేసి పార్టీ కోసం కృషి చేసిన వెలగలేటి గంగాధర్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం అభినందనీయము అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని బిజెపి నరసాపురం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు వెలగలేటి గంగాధర్ ను సాల్వా కప్పి అభినందించి పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్న దానికి నిదర్శనం గంగాధరని అన్నారు.