ఆదోని నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులకు యూరియా పంపిణీ చేయాలని గురువారం డెమోక్రసీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివిధ పంటలకు సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గుతుందని, రైతుల బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.