సంతోష్ నగర్ డివిజన్ పరిధిలో యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ఆదివారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య ఉందని తెలుపగా వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.