ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని యాడికి తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, ఎంపీడీవో వీర్రాజు అన్నారు. యాడికి మండల కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, మండల పరిషత్, జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కల నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెట్లు సమృద్ధిగా ఉంటే వర్షాలు బాగా కురుస్తాయన్నారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.