విద్యాభివృద్ధికి, పాఠశాలలు, అనుబంధ భవనాల అభివృద్ధికి దాతల కృషి అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండల విద్యాఖాధికారి కార్యాలయం శిధిలావస్థకు చేరుకోవడంతో దాతలు కాకరాల రమేష్ జ్ఞాపకార్థం డాక్టరు చంద్రశేఖరరావు, విజయలక్ష్మి దంపతులు రూ.3.50 లక్షలు, సబ్బితి సావిత్రి జ్ఞాపకార్థం వారి కుమారుడు పెదపాడు ఎంఈవో సబ్వితి నరసింహామూర్తి రూ.1.25 లక్షలు, మండల ఉపాధ్యాయులు 2.14 లక్షలు మొత్తం రూ.6.89 లక్షలతో ఎంఈవో కార్యాలయాన్ని ఆధునికీకరించారు. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దాతలను ఎమ్మెల్యే చింతమనేని సత్కరించి వారికి జ్ఞాపికలు అందజేశారు..