Download Now Banner

This browser does not support the video element.

కమలాపురం: కమలాపురం : చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Kamalapuram, YSR | May 24, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us