యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గణపతి మాల ధరించి వచ్చినందుకు స్కూలు యాజమాన్యం వారిని బయట నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చిందని విశ్వ హిందూ సంఘం నాయకులు శుక్రవారం ఆరోపించారు. ఈ సందర్భంగా గణపతి పూజలో ఉన్న విద్యార్థులను అనుమతించకుండా యాజమాన్యం అడ్డుకుందని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.