పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు బొల్లపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చేరుకునే సరికి స్టీరింగ్ రాడ్ చివరే ఊడిపోయి అదుపుతప్పింది. డ్రైవర్ బస్సును చాకచక్యంగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో మాట్లాడుతూ ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా పేర్కొన్నారు అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎటువంటి గాయం కాలేదు.