కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటానని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 19వ వార్డులో సోమవారం వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సైనికులు మాదిరి పని చేయాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు.