హిరమండలంలోని రెండు గిరిజన గ్రామాలకు సబ్ రేషన్ డిపోలు మంజూరైనట్లు ఇనాఛార్జి తహశీల్దార్ ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. పాండ్రు మానుగూడ, దబ్బగూడ గ్రామాలకు సబ్ రేషన్ డిపోలు కేటాయించినట్లు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమని సంప్రదించాలన్నారు.