సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చల్మ గ్రామంలో భారీ వర్షాలతో ఈరన్న వాగు చెరువు మత్తడి తెగిపోయింది. చెరువు మత్తడి తెగిపోవడంతో నీరు చెరువులో నుండి పంట పొలాలను ముంచెత్తుతోంది. చెరువు మత్తడి, తూము ప్రమాదకరంగా మారినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి చెరువు వద్ద మరమ్మత్తులు చేపట్టి చెరువు కట్ట తెగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.