ఇల్లందకుంట: మండలంలోని టేకుర్తి గ్రామంలో శనివారం 7 నెల గర్భవతి తిరుమలని హత్యకు సంబంధించి ఆదివారం రాత్రి జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజురాబాద్ ఇంన్చార్జి ఏసిపి శ్రీనివాస్ జి వెల్లడించారు. 7 నెలల గర్భవతి అయిన తిరుమలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బన్నీ తేజతోపాటు తండ్రి రాములు తల్లి రేణుక అభిలాష్ లను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న CI లక్ష్మీనారాయణ,SI క్రాంతి కుమార్ లను ACP శ్రీనివాస్ జి అభినందించారు