గురువారం మధ్యాహ్నం గద్వాల పట్టణంలోని గంజిపేట నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజిపేట పార్కు పక్కల ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు, న్యాయవాది వెంకటయ్య గారి ఇంటి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ లకు పూర్తి స్థాయిలో రక్షణ కంచెలు లేవన్నారు. పెద్ద వెంకన్న ఇంటి ముందర ఉన్న కరెంటు స్తంభం శిథిలావస్థకు చేరిందని, నూతన స్తంభం ఏర్పాటు చేయడానికి స్థంభం తీసుకువచ్చి సంవత్సరం పూర్తయిన ఏర్పాటు చేయలేదన్నారు.