రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరతలేదని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు. విశాఖ టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి కేవలం దుష్ప్రచారం చేస్తుందని, రైతులకు ఎటువంటి కష్టాలు గానీ ఇబ్బందులు కానీ కూటమీ ప్రభుత్వ హయంలో లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి వార్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.