వికారాబాద్ జిల్లాలో దారుర్ పరిగి మర్పల్లి మండల కేంద్రాలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం వాగులు పొంగి పొర్లాయి, పలు గ్రామాలకు రాకపోకలు బందు అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పలు గ్రామాలలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దారూర్ నుండి నాగారం వెళ్లేందుకు జైలపల్లి అండర్ బ్రిడ్జి వద్ద భారీ వరద నీరు రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ప్రజలు అటువైపు వెళ్ళొద్దని ప్రత్యామ్న మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.