వెంకటాచలంలోని తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో గిడుగు రామ్మూర్తి, కాళోజి నారాయణరావుల జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన సెమినార్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మాడభూషి సంపత్ కుమార్, ఆచార్య ఆర్వీఎస్ సుందరం, ఆచార్య అల్లం శ్రీనివాసరావు, ఆశాజ్యోతి, రాజగోపాల చక్రవర్తి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.