నంద్యాల జిల్లా కోవెలకుంట్ల BC హాస్టల్ వీధిలో డాక్టర్ అశోక్ నేతృత్వంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలంలో నిల్వ నీరు కారణంగా దోమలు పెరిగి మలేరియా, డెంగు వ్యాధుల ప్రమాదం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులు సూచించారు. 83 మందికి వైద్య సేవలు అందించి, 9 మందికి రాపిడ్ మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఎవరికి మలేరియా లక్షణాలు లేవని తెలిపారు.