కోడుమూరు పట్టణ సమీపంలో వెల్దుర్తి రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సంఘటనలో ఓ బైకు రోడ్డు పక్కన పడింది. వాహనదారులు స్పందించి గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు గోరంట్ల గ్రామవాసిగా తెలిసింది.