విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని,ఆర్టీసీ లకు నిధులు ఇవ్వాలని, ఆర్టీసీ లను పరి రక్షించాలని,3. సెప్టెంబర్ 12 న సేవ్ ఆర్టీసీ డే పేరుతో నిరసన తెలుపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, పేస్కేలు వెంటనే చేయాలని ,ఎస్ బీటీ,ఎస్ఆర్ బీఎస్ సీసీ ఎస్ కు నిధులు ఇవ్వాలని కోరుతూ ఇల్లందు డిపో ఎదుట కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.డిపో కార్మికులు పాల్గొన్న ఈకార్యక్రమంలో భద్రాద్రి కొత్త గూడెం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ అబ్దుల్ నబి, ఇల్లందు మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.