శనివారం రోజున ఏఐవైఎఫ్,ఎఐఎస్ఎఫ్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి నేతలు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో పాల్గొనడం తమకు గర్వంగా ఉందని విద్యార్థి నాయకులు కల్లూరి ధర్మేంద్ర, సత్య ప్రసాద్, మహేష్ తెలిపారు. ఈ సభలో సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు మాజీ సభ్యుడైన సురవరం సుధాకర్ రెడ్డిని స్మరించుకున్నారు.