తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగు నేడు బుధవారం రోజున రాత్రి 8 గంటలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరుగుతుండటంతో పోలీసులు, అధికారులు అలర్ట్ అయ్యారు. మేడారం పరిసర ప్రాంతాల్లోని షాపులు వెంటనే ఖాళీ చేయాలని గ్రామ పంచాయతీ మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎలాంటి సమస్య లు ఉన్నా సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా, 2023లో జంపన్నవాగు వరద గద్దెల వద్దకు చేరి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.