శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని మారుతి నగర్ కు చెందిన లాలేపల్లి సోమురెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఉదయం తన స్వగ్రామమైన లాలే పల్లిలోని పొలాల వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.