కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దోబూచులాడుతున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తాలని డిమాండ్ చేశారు.