కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సోమవారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు.ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు, నెయ్యి, వెన్నె తదితర ఆహారపదార్థాలను నైవేథ్యం సమర్పించారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడి వేషం ,గోపిక వేషాలు వేస్తూ మురిసిపోయారు. పాఠశాలల్లో చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీ కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. గ్రామాలలో యాదవులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.