వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా శనివారం కురిసిన వర్షానికి ధారూరు మార్కెట్లో కూరగాయలన్నీ నీటిలో తెలియడాయి. రైతులు భారీగా వర్షం కురవడంతో కూరగాయలను రోడ్డుపైనే వదిలి పక్కనే ఉన్న షాపుల వద్ద తలదాచుకున్నారు. వినియోగదారులకు కూరగాయలు అమ్మేందుకు వచ్చిన రైతులకు ప్రతి శనివారం జరిగే సంతలో ఎటువంటి నీడలేక పోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.