నార్సింగి పట్టణ కేంద్రంలో ఉదయం 4గం నుంచి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు మరో ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక పక్క మగవారు లైన్ లో నిలబడితే, మరో పక్క ఆడవారు నిలుచున్నారు. పంటలు వేసి ఎరువులు వేయక మడులు ఎర్రబడుతున్నాయని, సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట నష్ట పోతామని రైతుల ఆవేదన చెందుతున్నారు. అన్ని పనులు వదులుకుని యూరియా కోసం లైన్ లో నిలబడాల్సి వస్తుందని, ఆడ వారు సైతం ఇంటి పని వంట పని వదిలి పడిగాపులు పడాల్సిన దుస్థితి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఉదయం వారు మాట్లాడుతు తమ జీవన ఆధారం వ్యవసాయమే అని, వేసిన పంట సరిగ్గా పండక పోతే తమ బతుకులు ఆగం అవుతాయన్నారు